రెడ్నం గార్డెన్స్‌లోని ఎస్బీఐలో అగ్ని ప్రమాదం
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖ రెడ్నం గార్డెన్స్‌లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.
దీపావళి కారణంగా సెలవు కావడంతో గురువారం బ్యాంకును తెరవలేదు. లోపల నుంచి పొగలు వస్తుండటాన్ని స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన వారు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది మంటలు ఆర్పారు. కిటికీలు పగలగొట్టి మంటలార్పేందుకు యత్నించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినా పెద్దఎత్తున పొగ వెలువడుతోంది. అగ్నిప్రమాదంలో కంప్యూటర్లు, ఫర్నిచర్, కొన్ని దస్త్రాలు దగ్ధమయ్యాయి. నగదు విభాగానికి సంబంధించి ఇబ్బంది లేదని ఎస్బీఐ అధికారులు తెలిపారు.