వైసీపీ కార్యకర్తలకు మాజీ స్పీకర్ తమ్మినేని, మాజీ మంత్రి సీదిరి పరామర్శ
అక్షర కిరణం, (పలాస): కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకుల చేతిలో దాడికి గురైన మొదలవలస మన్మధరావు, అల్లు రమణను మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పరామ ర్శించారు. వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మొదల వలస మన్మధరావు ఇంటికి చేరుకొని దాడికి గురైన విషయాలు తెలుసుకొన్నారు. మన్మధరావు, అల్లు రమణను పరామర్శించారు. ఎవరు అధైర్య పడొద్దు, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఫోన్లో మొదలవలస మన్మధరావు, అల్లు రమణను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.