విజయనగరం రైల్వేస్టేషన్లో పర్యావరణ దినోత్సవం
అక్షర కిరణం, (విశాఖపట్నం): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ రైల్వేలు మే 22 నుండి జూన్ 5వ తేదీ వరకు సమగ్ర పరిశుభ్రమైన పర్యా వరణ ప్రచారాన్ని ప్రారంభించాయని వాల్తేర్ డివిజన్ సీని యర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ తెలి పారు. ఈ ప్రచారంలో భాగంగా, వాల్టెయిర్ డివిజన్ పర్యా వరణ అవగాహన పెంచడానికి అనేక కార్యక్రమాలను చేప ట్టింది. స్టేషన్ ప్రాంగణంలో పబ్లిక్ డ్రైవ్‌లు సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌లపై నిషేధం గురించి ప్రయాణికులకు తెలియజేస్తు న్నామని సందీప్ తెలిపారు. ఈక్రమంలో విజయనగరం రైల్వే స్టేషన్లో వాల్టెయిర్ డివిజన్ పర్యావరణ, హౌస్ కీపింగ్ విభాగం రైల్వే సిబ్బంది ఎన్జీవో మద్దతుతో వివిధ రైల్వేస్టేష న్లు, రైల్వే సంస్థలు సమీప ప్రాంతాలలో ప్రత్యేక పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ డ్రైవ్‌లను నిర్వహించినట్టు తెలిపారు.