అక్రమ కట్టడాలపై ఎన్ఫోర్స్మెంట్ టీం
జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సంపత్ కుమార్
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుం దని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఎక్కువగా అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు వస్తున్నా యని త్వరలోనే ఎన్ఫోర్స్మెంట్ టీం నియమించి ఒక అధికారిని నియమించి అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపుతామని తెలిపారు. అలాగే నగరంలోని రోడ్లు, డ్రైనేజీవ్యవస్థ, మంచినీటి సౌకర్యం దళిత అంశాలు గ్రీవెన్స్ లో పరిష్కరిస్తామని తెలిపారు. పి జె ఆర్ ఎస్ సిస్టం ద్వారా ఐదు కౌంటర్లను పెట్టి ప్రతిరోజు గ్రీవెంట్ సమస్యలు పరిష్కరించేలా ప్రజలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పి జె ఆర్ ఎస్ సిస్టం ని త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని కమిషనర్ డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు.
రూ.1.50 కోట్లతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన
అక్షరకిరణం (వజ్రపుకొత్తూరు): రెయ్యిపాడు పంచాయతీలో కొండవూరు తారు రోడ్డు నుండి రెయ్యి పాడు తారు రోడ్డు వరకు నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. సుమారు 2కిలోమీటర్ల రోడ్డును 1కోటీ 50లక్షలతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఎంపీటీసీ సూళ్ల చిట్టిబాబు సమక్షంలో శంకుస్థాపన చేశారు. కార్యక్రమం లో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కోనారి కిరణ్ కుమార్, కోనారి మల్లేష్, కీలు మాధవరావు, సూళ్ల శాంతారావు, కీలు ఎర్రన్నా, వేంకటస్వామి, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
నేను హోం మంత్రి అయితే పరిస్థితి మరోలా ఉంటుంది
పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
అక్షర కిరణం, (పిఠాపురం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా నేను బాద్యతలు తీసుకుంటాను అని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా హోం మంత్రి వంగలపూడి అనిత రివ్యూ చేయాలి అని ఆయన కోరారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకం. పోలీసులు మర్చిపోకండి అని తెలిపారు. మా బంధువు అంటే మడత పెట్టి కొట్టండి.. ఆడ పిల్లలను రేప్ చేస్తే కులం ఎందుకు వస్తుంది.. ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులకి ఏం చెప్తుంది.. తెగే వరకు లాగకండి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇక, బయటకు వస్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు అని డిప్యూటీ సీఎం పనవ్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు బాధ్యతలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు. పదవి ఉండొచ్చు లేకపోవచ్చు ఐ డోంట్ కేర్.. గత ప్రభుత్వం లో లా పోలీసులు అలసత్వంగా ఉండకండి అని సూచిం చారు. 30వేల మంది ఆడపిల్లలు మిస్ అయితే గత ప్రభు త్వంలో సీఎం మాట్లాడలేదు.. అత్యాచారాలు చేసే నీచులు, దుర్మార్గులను ఏం చేయాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం తాలూకా వారసత్వం కొనసాగుతుంది.. గత ప్రభుత్వంలో నన్ను చంపేస్తామంటే ఒక్క పోలీస్ కూడా మాట్లాడలేదు.. గత ప్రభుత్వంలో రేప్ చేసే వారిని ఎంకరేజ్ చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ ఆరోపించారు.