బాలలకు విద్యా, ఆరోగ్యంతోపాటు భద్రత ముఖ్యం
కఏపీఎస్సీఆర్పీసీ చైర్మన్ కేసలి అప్పారావు
అక్షర కిరణం, (విజయనగరం): బాలలు అందరికీ చదువు ఆరోగ్యంతోపాటు భద్రత ముఖ్యం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ (ఏపీఎస్సీఆర్పీసీ) చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు. బుధవారం విజయనగరం కలెక్టర్ ఆడిటోరియంలో కిశోరి వికాసం పథకం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలలతో పనిచేస్తున్న అధికారులు, సంస్థలు సంఘాల ప్రతినిధులు అందరి భాగస్వామ్యంతో విజయనగరం జిల్లాను బాలల స్నేహ పూర్వక జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషిచేయాలని బాలలు దురలవాట్లు చెడు స్నేహాలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. బాలలు అందరూ లైఫ్ స్కిల్స్‌తోపాటు స్వయం రక్షణకు కావలసిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.