ఏవీఎన్ కళాశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): నగరంలోని ఏవీఎన్ కళాశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు బుధ వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరాధన ప్రార్ధనలు, క్రీస్తు ఆధ్యాత్మిక గీతాలాపనలు చేశారు. అనంతరం విద్యార్థులు శాంటా క్లాజ్ వేషధారణలో అలరించారు. కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలను ఆనందంగా నిర్వహించుకున్నారు. కార్యక్రమానికి పాస్టర్ డేవిడ్ రాజు ముఖ్య అతిధిగా హాజరై క్రిస్మస్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రిన్సిపాల్ ఎం.సింహాద్రినాయుడు మాట్లాడు తూ కుల, మత, జాతి బేధాలు లేకుండా అన్ని పండగలు ఏవీఎన్ కళాశాలలో చేసుకుంటున్నామన్నారు. కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ కృష్ణకుమారి, డీన్ శంకరనారాయణ రావు, పైడి రజనీ, జి.యేసయ్య, సురేష్‌బాబు, జె.రామారావు తదితరులు పాల్గొన్నారు.
జగ్గారావు సేవలు చిరస్మరణీయం..
విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఏవీఎన్ జగ్గారావు 98వ జయంతి వేడుకలు మిసెస్ ఏవీ ఎన్ కళా శాలలో బుధవారం నిర్వహించారు. విద్యారంగ అభివృద్ధికి, సామాజిక వికాసానికి జగ్గారావు చేసిన కృషిని ఆ సంస్థ కరస్పాండెంట్ ఏవీ అదీప్ భానోజీరావు కొనియాడారు. తొలుత జగ్గారావు చిత్రపటానికి కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం పూలమాలలు వేశారు.