డాక్టర్ కూటికుప్పల సూర్యారావుకు సోదర వియోగం
కసోదరుడు అప్పారావు కన్నుమూత
కకుటికుప్పలకు పలువురి పరామర్శ కఅప్పారావు కుటుంబాన్ని పరామర్శించిన పోర్టు ఉద్యోగులు
అక్షర కిరణం, (మాధవధార): ప్రముఖ హోమియోపతి వైద్యుడు కూటికుప్పల సూర్యారావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు అప్పారావు కన్నుమూశారు. ఆయన మృతితో కూటికుప్పల సూర్యారావుకు పలువురు తమ సానుభూతి తెలిపారు. అయ్యప్పనగర్లో నివాసం ఉంటున్న డాక్టర్ కూటికుప్పల సూర్యారావు సోదరుడు అప్పారావు సోమవారం సాయంత్రం గుండె పోటుతో మృతి చెందారు. ఆయన మరణవార్త తెలిసిన పలువురు అప్పారావు బౌతికదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సోదరుని మరణంతో బాధపడుతున్న డాక్టర్ కూటికుప్పల సూర్యరావును పలువురు ఓదార్చరు. పోర్టు విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన అప్పారావు కుటుంబాన్ని పోర్టు ఉద్యోగులు పలువురు కలిసి పరామర్శించారు. కాగా మాధవధార శ్మశాన వాటికలో అప్పారావు అంత్యక్రియలు పూర్తయ్యాయి.