రద్దైన దివ్యాంగ పింఛనుదారులు దరఖాస్తు చేసుకోవాలి
కమున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు
అక్షరం కిరణం (పలాస): కొన్ని సాంకేతిక కారణాల వలన రద్దయిన లేదా పెన్షన్ రకం మారిన అసలైన దివ్యాంగులు నిరాశ చెందకుండా మరలా దరఖాస్తు చేసుకున్నచో తిరిగి వారి దివ్యాంగ పెన్షన్లు పునరుద్ధరి స్తామని మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు తెలిపారు. ఈ పురపాలక సంఘంలో మొత్తం రద్దయిన దివ్యాంగ పెన్షన్లు 27 కాగా, అందులో 5 పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లుగా మార్పు చేశామని చెప్పారు. మిగిలిన 22 మంది కూడా మళ్లీ ఈదిగువ తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకున్నట్లయితే వారి దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు. ఇందులో మొదటగా రద్దయిన ఫించన్దారుడు అప్పీలు కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సదరు దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, రద్దయిన లేదా మార్పు చెందిన పెన్షన్ నోటీసు కాపీ, సదరం సర్టిఫికెట్ పాతది, సదరం సర్టిఫికెట్ కొత్తది, పెన్షన్‌దారుడు ప్రస్తుతం ఏదైనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లయితే అందుకు సంబంధించిన డాక్యుమెంట్ల కాపీలు సదరు అప్పీలు దరఖా స్తుతోపాటు జత చేయాలని కోరారు. అప్పీలు చేసుకున్న దరఖాస్తుదారులకు మరోక్కసారి తిరిగి వైద్య పరీక్షల కోసం నోటీసు జారీ చేస్తామన్నారు. తదుపరి రద్దయిన పెన్షన్‌దారులు తిరిగి వైద్య పరీక్షలకు హాజరు కావలసి ఉంటుందని కమిషనర్ నడిపేన రామా రావు తెలిపారు.