5వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): జీవీఎంసీ 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత వార్డులో పర్యటించి పలు అభివృద్ధి పనులకు సోమవారం భూమిపూజ చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సహాయ సహకారంతో వార్డులో దీర్ఘకాలిక సమస్య లకు పరిష్కారం దొరికిందన్నారు. రూ.10 కోట్లతో వార్డులో పలు అభివృద్ధి పనులు మొదలుపెట్టామని తెలిపారు. ప్రజ ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని రోడ్లు, కల్వట్లు, పార్కుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయన్నారు. ఎన్టీఆర్ హుద్‌హుద్, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో తాగునీటి సమస్య, యూజీడీ సమస్య ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దృష్టిలో పెట్టి పరిష్కరిస్తామన్నారు. పాత పర దేశిపాలెం, స్వయంకృషినగర్, అయ్యప్ప నగర్ కాలనీలలో నాయకులతో కలిసి మంజూరైన పనులకు భూమిపూజ చేసి మొదలుపెట్టామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, నమ్మి శ్రీను, ఈగల రవి, కొండపు రాజు, జనసేన నాయకులు శ్రీకాంత్ రెడ్డి, టీడీపీ నాయకులు ఎర్రయ్య రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, వెంకట రెడ్డి, శివ, వర్క్ ఇన్స్పెక్టర్ రాజు, సచివాలయ కార్యదర్శులు శ్రావణి, రాము, వీరబాబు, జగదీష్ పాల్గొన్నారు.