హర్ ఘర్ తిరంగా ర్యాలీలో డిప్యూటీ మేయర్ దల్లి గోవింద రెడ్డి
అక్షర కిరణం, (గాజువాక): గాజువాక నియోజకవర్గం నడుపూరు హైస్కూల్లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాలు పట్టుకొని భారత్ మాతా కీ జై, హర్ ఘర్ తిరంగ, వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో భారీ ఎత్తున స్థానిక నాయకులు, యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 75 వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, గాజువాక బీజేపీ ఇంచార్జ్ కేఎన్ఆర్, ముసలయ్య, శ్రీనివాస్, కృష్ణంరాజు, నడుపూరు హైస్కూల్ హెచ్ఎం, 64వ వార్డ్ అధ్యక్షుడు చోడిపిల్లి ముసలయ్య, కూటమి సభ్యులు, స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.