3 నుంచి సీతన్న గార్డెన్స్ కనకమహాలక్ష్మి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
ఆలయ ధర్మకర్త సనపల కీర్తి
అక్షర కిరణం, (మాధవధార): విశాఖ నగరంలో 51వ వార్డులో సీతన్నగార్డెన్లో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి, గాయత్రి దేవి, కనక దుర్గ దేవి ఆలయంలో ఈనెల 3 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మనంగా నిర్వహిస్తు న్నట్లు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి తెలిపారు. అన్నారు. ఈఉత్సవాల కోసం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఆలయ ధర్మకర్త కీర్తి మాట్లాడుతూ ఈనెల 3 నుండి 12వ తేదీ వరకు అమ్మవారు ఒక్కోక్క రోజు ఒక్కోక్క అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారన్నారు. ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3వ తేది గురువారం బాలత్రిపుర సుందరి దేవి గా, 4న శుక్రవారం గాయత్రి దేవిగా, 5న అన్నపూర్ణదేవిగా, 6న శ్రీ కనకమహాలక్ష్మి దేవిగా, 7న లలిత త్రిపుర సుందరి గా, 8న సరస్వతి దేవిగా, 9న బుధవారం శాకాంబారి దేవిగా, 10న గురువారం దుర్గదేవిగా, 11న మహిషాసుర మర్ధినిగా, 12న రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నట్లు సనవల కీర్తి తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల లో లలితా సహస్రనామ కుంకుమార్చన, ప్రత్యేక పూజలు, విశేష పూజలు, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించను న్నట్లు వివరించారు. 10వ తేదీ గురువారం మధ్యాహ్నం 12గంటల నుంచి ఆలయంలో భారీ అన్నసమారాధన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని, దీక్షపరులకు, సామాన్య ప్రజలకు అమ్మవారి దర్శనం నేరుగా కలిగేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త సనవల కీర్తి తెలిపారు.