‘ప్రిజర్వ్ ది ఉటిరస్’ కార్యక్రమంపై ఫార్మా కంపెనీ ప్రతినిధులతో డీఎంహెచ్వో సమీక్ష
విద్యుత్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్వో డాక్టర్ జగదీశ్వరరావు
అక్షర కిరణం, (విశాఖపట్నం): జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావుతో ఢల్లీికి చెందిన బేయర్ జైదాస్ ఫార్మా కంపెనీ రిప్రజెంటేటివేస్ మనోజ్, డాక్టర్ దాలి భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ‘ప్రిజర్వ్ ది ఉటిరస్’ శిబిరంపై చర్చించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పరిధిలోని ఆరోగ్య సిబ్బందికి ఈ కార్యక్ర మంపై శిక్షణ ఇచ్చేందుకు వారు జిల్లాకు వచ్చినట్టు డీఎం హెచ్వో డాక్టర్ జగదీశ్వరరావు తెలిపారు. డీఎంహెచ్వో డాక్టర్ జగదీశ్వరరావు విద్యుత్నగర్లోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఈ ఆశా డేలో న్యూ బోర్న్ కేరింగ్ గురించి గ్రోత్ మానిటరింగ్ చార్ట్ గురించి న్యుమోనియా ఏ విధంగా ముందుగా తెలుసుకోవాలి...? స్పేసింగ్ మెథడ్స్ ఏ విధంగా పాటించాలి వంటి విషయాలు తెలియచేసారు. మాత, శిశు సేవలు సంబంధించి ఐదేళ్ల లోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల గురించి, హోం బేస్డ్ న్యూ బోర్న్ కేర్, హోం బేస్డ్ యంగ్ చైల్డ్ కేర్, ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ అఫ్ నియో నాటల్ చైల్డ్ ఇల్నెస్ గురించి, చార్ట్స్, బుక్లెట్స్, ఐఇసి మెటీరియల్తో అవగాహన కల్పించారు. పీహెచ్సీ వైద్యులు, పర్యవేక్షకుల బాధ్యతలు, ప్రభుత్వం సరఫరా చేసే ప్రేగ్నేన్సి కిట్స్, ప్రతీ ఆశా కార్యకర్త వద్ద కనీసం 10 ఉండాలని ఇ-ఆశా యాప్ సర్వీస్ అప్డేట్ చేయాలని ఐరన్ ఫోలిక్ ఆసిడ్స్ మాత్రలు న్యూట్రిషన్, వీహెచ్ఎస్ కమిటీలు గురించి ఆశాలు శ్రద్ద తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఎంపీ హెచ్ఈవోలు వి.నారాయణరావు, నాగభూషణం పాల్గొన్నారు.