విమ్స్ వద్ద కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది ధర్నా
అక్షరకిరణం, (విశాఖపట్నం సిటీ): హనుమంతు వాక వద్ద వున్న విమ్స్ ఆస్పత్రి కాంట్రాక్టు ప్రాతిపదికన విధు లు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది ధర్నా చేశారు. రాష్ఠ్ర ప్రభు త్వం విడుదల చేసిన జీవో నంబర్ 115 రద్దు చేయాలని కోరుతూ ఆస్పత్రి గేటువద్ద గురువారం ఉదయం వీరు ధర్నా చేశారు. కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 214 మంది ని రెగ్యులర్ చేయాలని నినాదాలు చేశారు. సిబ్బంది జయ రాజు, మోనిక, భారతి, భరత్, కిషోర్, వెంకటదుర్గ తదిత రుల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబుకు వినతిపత్రం అందచేశారు.