కంటైనర్‌లో దొంగల పరారీ: సినీ ఫక్కీలో ఛేజింగ్
అక్షర కిరణం, (చెన్నయి/జాతీయం): పలు ఏటీఎం లను పగలు కొట్టి అందులోని భారీ నగదును కొల్లగొట్టి కంటైనర్‌లో పరారవుతున్న దొంగలను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఈఘటనలో దొంగలు, పోలీసుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక దొంగ మరణించగా.. పలువురు దొంగలతోపాటు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కేరళ త్రిసూర్తోని వివిధ ప్రాంతాల్లోని ఎస్బీఐ ఏటీఎంలు పగులకొట్టి భారీగా నగదు చోరీ చేశారు.
దాదాపు రూ. 60 లక్షలకు పైగా నగదు చోరీ జరిగినట్లు సమాచారం. అయితే ఏటీఎంలలో చోరీకి పాల్పడిన దొంగలు కంటైనర్‌లో నగదుతోపాటు పరారవుతు న్నట్లు తమిళనాడులోని నమక్కల్ జిల్లా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో వారు రంగంలోకి దిగారు. ఆ కంటైనర్‌ను ఆపేందుకు జిల్లా పోలీసులు ప్రయత్నించారు. కానీ కంటైనర్ డ్రైవర్.. మాత్రం వేగంగా ముందుకు పోనిచ్చాడు. దీంతో పోలీసులు కంటైనర్‌ను వెంబడిరచారు. పోలీసులపైకి దొంగలు కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు సైతం ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఒక దొంగ మరణించారు. అలాగే పలువురు దొంగలతోపాటు పోలీసులకు సైతం గాయా పడ్డారు.
దాదాపు 12 కిలోమీటర్ల మేర ఈ ఛేజింగ్ సీన్ సాగింది. అనంతరం కంటైనర్‌ను పోలీసులు నిలువరించా రు. దీంతో ఆరుగురు దొంగలను పట్టుకున్నారు. కంటైనర్ లోని భారీ నగదుతోపాటు ఓ కారును సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు రూ. 60 లక్షల వరకు ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడిరచారు.
వీరంతా హరియాణాకు చెందిన గ్యాంగ్ అని వివరించారు. ఏటీఎంల్లో చోరీ చేసే సమయంలో ఏటీఎం అండర్ రిపేర్ అంటూ బోర్డ్ పెట్టేవారని వివరించారు. దీంతో నగదు తీసుకునేందుకు ఎవరూ ఈ ఏటీఎం వద్దకు వచ్చే వారు కాదన్నారు. దీంతో ఏటీఎం చోరీ చేయడం వీరికి చాలా సులువైందని చెప్పారు. అయితే ఈ గ్యాంగ్ పారిపోతున్నట్లు తమిళనాడులోని నమక్కల్ జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ గ్యాంగ్ వెళ్తున్న కంటైనర్‌ను ఛేజ్ చేసి వారిని అరెస్ట్ చేశారు. గాయపడిన పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు ఐజీ సెంథల్ కుమార్ చెప్పారు. ఈ గ్యాంగ్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారన్నారు. ఒకరు మరణించడంతో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.