వరల్డ్ వైస్ కన్జ్యూమర్ రైట్స్, ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన
అక్షర కిరణం, (మాధవధార): మురళినగర్లో గాయత్రి విద్యా మందిరలో వరల్డ్ వైస్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో కన్జ్యూమర్ ఎవర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. గాయత్రి విద్యా మందిర్ స్థాపకులు, చైర్మన్ జగదీశ్వర్ రావు, 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు బాల బాలికలు వారి తల్లిదండ్రులతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి డాక్టర్ రామానుజ స్వామి చైర్మన్ ఫౌండర్ డబ్ల్యు సీఆర్పీ, డాక్టర్ రంగాల బాబురావు నేషనల్ జాయింట్ సెక్రటరీ డబ్ల్యుసీఆర్పీబీ అప్పలరాజు ట్రెజరర్ డబ్ల్యుసీఆర్ పీ మార్టిన్ పేరెరా సౌత్ ఇండియా జన రల్ సెక్రెటరీ డబ్ల్యుసీఆర్పీ రిషి విశాఖ డిస్ట్రిక్ట్ చైర్మన్ డబ్ల్యుసీఆర్పీ హరిబాబు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి సౌత్ ఇండియా జనరల్ సెక్రెటరీ మార్టిన్ పేరెరా అధ్యక్షత వహించగా, నేషనల్ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ రంగాల బాబురావు, ట్రెజరర్ అప్పలరాజు, కార్యక్రమా నికి స్కూలు వ్యవస్థాపకులు జగదీశ్వరరావు వందేమాతరం తో కార్యక్రమాన్ని ప్రారంభించి జనగణమనతో ముగించారు. కరెస్పాండెంట్ ధర్మారావు ఉపాధ్యాయులు పేరెంట్స్ స్టూడెం ట్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గాయత్రి విద్యా మందిర్ ఫౌండర్ చైర్మన్ జగదీశ్వర్ రావు తెలియజేశారు.