గురుకుల పాఠశాల బాలుర హాస్టల్ తనిఖీ చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్
కపల్లెనిద్ర చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్
అక్షర కిరణం, (సాలూరు): పాచిపెంట మండలం పికోనవలస గిరిజన గురుకుల పాఠశాల బాలుర విద్యార్థుల తో వసతి గృహంలో పల్లె నిద్ర కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్. గురువారం రాత్రి నిర్వ హించారు. ఈసందర్భంగా పి.కోనవలస గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పర్య వేక్షించారు. ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాల బాలుర వసతి గృహంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెనూ చార్ట్ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారి సమస్య లను అడిగి తెలుసుకున్నారు. గురువారం రాత్రి విద్యార్థులతో బస చేశారు. గురుకుల పాఠశాలలో విద్యార్థు లు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిం చాలని, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌కు తగిన సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో పాచిపెంట తహసీల్దార్ డి.రవి, ఎంపీడీవో బీవీజీ పాత్రో, డాక్టర్ శివకుమార్, ఎంఈఓ జోగారావు, వీఆర్వో శ్రీను, కార్యదర్శులు శ్రీను, శివకుమార్, ఇంజినీర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.