గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్ అంబేద్కర్
అక్షర కిరణం, (విజయనగరం): గ్రంథాలయాలు దేవాలయాలు లాంటివని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గురజాడ స్మారక జిల్లా గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈకార్యక్ర మానికి కలెక్టర్ అంబేద్కర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బాలల దినోత్సవం సందర్భంగా ముందుగా దివంగత జవ హర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, పుస్తకాలు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని చెప్పారు. డీఈవో మాణిక్యం నాయుడు మాట్లాడుతూ మంచి పుస్తకాలు ఎంతో విలువైనవని అన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పుస్తకాలు గొప్ప మార్గమని సూచించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి డి.రమేష్ మాట్లాడుతూ ప్రతీఏటా వారోత్సవాలను నిర్వహించడంతో గ్రంథాలయాల ప్రాధాన్యం అందిరికీ తెలుస్తోందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.లక్ష్మి, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏ.గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.