సెప్టెంబర్ 1న చలో విజయవాడ పోస్టర్ల ఆవిష్కరణ
అక్షర కిరణం, (విశాఖపట్నం): సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1 రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ‘‘చలో విజయవాడ’’ పోస్టర్లను శుక్రవారం విశాఖపట్నం జిల్లాలో ఆవిష్కరించారు. రాష్ట్ర ఆద్యక్షులు కోరుకొండ సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటై ఒక ఏడాది పూర్తి అయినా కనీసం సీపీఎస్ విధానంపై ఆమోద యోగ్యమైన పరిస్కారం చూపిస్తాను అన్న ప్రభుత్వ హామీ కి ఏలాంటి ప్రయత్నం చేయకపోవడంపై రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగుల ఆవేదన తెలియజేసేందుకు సెప్టెంబర్ 1న రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమం నిర్వ హిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని మన నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్లులు గూనూరు శ్రీను, మధుక్రిష్ణ, అప్పాజీ, ప్రతాప్, ఆనంద్, భాస్కర్, శ్రీను, గణేష్, ప్రవీణ్ పాల్గొన్నారు. సీపీఎస్ సాధనకు పోరాటమే శరణ్యమని పేర్కొన్నారు.