క్యాన్సర్ వ్యాధి ఔషధాలపై కేంద్రం కీలక ఆదేశాలు
3 ఔషధాల ఎంఆర్పీ తగ్గిస్తూ నిర్ణయం
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన ఔషధాలపై కేంద్రం కీలక ఆదేశాలను జారీ చేసింది. కేన్సర్ వ్యాధి నిరోధానికి వినియోగించే మందులు బాగా ఖరీదైనవి. సామాన్య ప్రజలకు సైతం వాటిని సరసమైన ధరలకు అందించాలనే సంకల్పంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ రోగులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుంది. వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాన్సర్ చికిత్సలో ఉపయో గించే మూడు ప్రధాన ఔషధాల ఎంఆర్పీ ధరలను తగ్గించింది. ఈమేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) మూడు క్యాన్సర్ నిరోధక ఔషధాల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చికిత్సలో వాడే ట్రాస్టూజుమాబ్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్ అనే మందుల ధరలు తగ్గనున్నాయి.
ఈ వ్యాధి నిరోధానికి వినియోగించే మందులు బాగా ఖరీదైనవి. సామాన్య ప్రజలకు సైతం వాటిని సరసమైన ధరలకు అందించాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ సర్కార్ తెలిపింది. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2024-25లోనే వీటికి కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ విభాగం ఈ మూడు మందులపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేసింది. అలాగే జీఎస్టీ రేటు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఈమేరకు ఎంఆర్పీని తగ్గించాలని తయారీదారులను ఎన్పీపీఏ ఆదేశించింది. ధరల మార్పు గురించి డీలర్లు, రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని సూచించింది.