బాలిక అదృశ్యంపై కేసు నమోదు
అక్షర కిరణం, (మాధవధార): ఇంటి నుండి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైన ఘటన దండు బజార్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా లిలా ఉన్నాయి. కె.జయ తన భర్త, ఇద్దరు కుమార్తెలతో జీవిస్తున్నారు. ఆమె రెండవ కుమార్తె దీక్షిత(17) ఉమెన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుంది. ఏప్రిల్ 5న దీక్షిత పుట్టినరోజు సందర్బంగా తన స్నేహితురాలితో కలిసి సింహా చలం వెళ్తానని ఇంటి నుండి బయటకు వెళ్ళింది. అయితే ఎప్పటికి తిరిగిరాకపోయేసరికీ చుట్టూపక్కల ప్రాంతాల్లో ను, స్నేహితులు, బంధువుల వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహారాణిపేట పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన యువతీ తెలుపు ఛాయలో ఉటుందని, ఇంటి నుండి వెళ్లే సమయంలో ఎరుపు రంగు హాఫ్ సారీతో ఉన్నట్టు తెలిపారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేయాలనీ సీఐ సూచించారు. మహారాణిపేట సీఐ భాస్కర్ రావు, హెడ్ కానిస్టేబుల్ సోమరాజు నేతృత్వంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.