క్యాబినెట్ సబ్ కమిటీతో జర్నలిస్టులకు మేలు
కఏపీయూడబ్ల్యుజే ప్రతినిధులతో మంత్రి నాదెండ్ల మనోహర్
అక్షర కిరణం, (విశాఖపట్నం): జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ కృషి చేస్తుందని పౌర సర ఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్య వర్గం పిలుపుమేరకు బుధవారం జర్నలిస్టుల కోర్కెల దినాన్ని విశాఖ జిల్లా జర్నలిస్టులు పాటించారు అందులో భాగంగా కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను కలిసి సమస్యలను వివరించారు. అనంతరం విశాఖ జిల్లాకు విచ్చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసి రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొం టున్న సమస్యలను వివరించారు. ప్రధానంగా దాదాపు మూడు సంవత్సరాలుగా కొత్త అక్రిడిడేషన్లు ఇవ్వకపోవడం వల్ల చాలా మంది జర్నలిస్టులు నష్టపోతున్నారని వివరించారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులను కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు గుర్తించడంతో పూర్తిస్థాయి న్యాయం జరగడం లేదన్నారు. ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా నగర అధ్యక్షులు కే రాము జిల్లా ప్రధాన కార్యదర్శి రావులవలస రామచంద్రరావు తదితరులు జర్నలిస్టుల సమస్య లను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీని నియమించింది అని అందులో మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారని గుర్తు చేశారు. జర్నలిస్టుల ఇళ్ల సమస్యలతో పాటు ఇతర రాష్ట్రాల్లో చెల్లిస్తున్న పెన్షన్ విధానాన్ని ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు వివరించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్య వర్గ సభ్యులు కే చంద్రమోహన్ డి హరినాథ్ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు చందు యాదవ్.. సివిఆర్ శ్రీనివాస్... సుధ, భరత్.. సీనియర్ జర్నలిస్ట్ మనభూమి సత్యనారా యణ, ఏపీయూడబ్ల్యూజే గాజువాక అధ్యక్షులు పరశురాం జిల్లా కార్యవర్గ సభ్యులు రామనాయుడు తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.