28న సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభ పోస్టర్ల ఆవిష్కరణ
అక్షర కిరణం, (పలాస): ఈనెల 28న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు న్యూడెమోక్రసీ పార్టీల విలీన సభ నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేయాలని న్యూడెమోక్రసీ పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం ఆవరణలో రెండు విప్లవ పార్టీల విలీనం సభ పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రకాష్ మాట్లాడుతూ ఈ విలీన సభకు ప్రధాన వక్తగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జాతీయ అధికార ప్రతినిధి దర్శన్ సింగ్ ఖట్కర్ హాజరైతారని తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ ఫాసిస్టు విధానాలను అమలు చేస్తూ ప్రజల మధ్య ఉన్న సోదర భావాన్ని దెబ్బతీస్తుందన్నారు. అమరవీరుల ఆశయ సాధనకు రెండు న్యూడెమోక్రసీ పార్టీలు ఐక్యమవుతున్నా యని తెలిపారు. భవిష్యత్తులో విప్లవకారులందరినీ ఐక్యం చేసి బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ, పీవోడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, పీవైయల్ జిల్లా కన్వీనర్ సార జగన్, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు బర్ల గోపి, పోతనపల్లి మల్లేశ్వరరావు, ఏఐకెఎంఎస్ జిల్లా నాయకులు రాపాక మాధవరావు, జి.కామేశ్వరరావు, జె.అప్పయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు.