వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సీఎం సమీక్ష
అక్షరకిరణం, (విజయవాడ /అమరావతి): బుడమేరుతోపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సోమ వారం మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం వరద పరిస్థితిపై సమీక్షించారు. విధుల్లో ఉన్న హెలికాప్టర్‌తో అందు తున్న సాయంపై వివరాలు అడిగి తెలు సుకున్నారు. మిగిలిన హెలికాప్టర్లను కూడా వీలైనంత త్వరగా రప్పించాలని అధికారులను ఆదేశించారు. ఆహార పంపిణీ ఎంత మేరకు పంపిణీ చేశారో డివిజన్ల వారీగా సీఎం అడిగి తెలుసు కున్నారు. ఇతర జిల్లాల్లో తయారు చేసి తరలిస్తున్న ఆహారం పైనా ఆరా పునరా వాస కేంద్రాలకు వచ్చేవారికి దుస్తులు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితుల సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలని సూచనలు జారీ చేశారు. కమ్యునికేషన్లో అంతరా యం ఏర్పడకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
ఆహారంతోపాటు పండ్లు పంపిణీకి కూడా ఏర్పాట్లు చేయాలని అధికారు లకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజుల్లో బాధితులకు అందిం చేందుకు కూరగాయలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశం సమస్యను రెండుమూడు రోజు లపాటు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
(విజయవాడలోని 46వ వార్డులో ఎన్డీఆర్ఎఫ్ బృందం అప్పుడే పుట్టిన
శిశువుకు పునరావాసం కల్పించింది)