సంచారజాతులను సందర్శించిన బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కో కన్వీనర్ సురేష్‌బాబు సింగ్
అక్షర కిరణం, (శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా సంచారజాతులు, రాష్ట్ర కో కన్వీనర్ పీ.సురేష్ బాబు సింగ్ ఆధ్వర్యంలో సంచార జాతులు నివసిస్తున్న ప్రదేశాలను సందర్శించి, వారిని కలిసి వారి జీవన విధానాన్ని తెలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకో న్నారు. విలేఖరులతో పీ.సురేష్ బాబు సింగ్ మాట్లడుతూ ఈ సంచారజాతుల వారు దేశంలో సాంస్కృతి ,సంప్రదాయలును పరి రక్షణ చేస్తూ ధర్మ ప్రచా రకులుగా ఊరు, ఊరు తిరుగుతూ వారి కుల వృత్తులు చిన్న చిన్న, పనులు చేసుకుంటూ, అనేక ఆర్థిక, అనారోగ్య సమస్యలతో దుర్భరమైన జీవితం గడుపుతున్నారన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ సంచారజాతుల సంక్షేమ న్నీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. అత్యంత వెనుకబడిన కులాల కార్పొరేషన్ (ఎంబీసీ)కు గత వైసీపీ ప్రభుత్వం నిధులను ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి అగ మ్యగోచరంగా మారిందన్నారు. ఇపుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సంచారజాతులకు ఒక ప్రత్యేక బీసీ కమిషన్ వేసి వారి జీవన విధి విధాన్ని, వారు ఏ ఏ ప్రాంతా ల్లో సంచారం చేస్తున్నారు. వారి ఆర్థిక పరిస్థితులు, సేర్వేలు జరిపి, ఆధ్యాయనం చేయాలని, వారికి ఏయే ఆర్థిక సహాయం చేస్తే అభివృద్ధి చెందుతారన్న విషయాలను అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేయాలన్నారు. కార్య క్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అప్పలరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు చిట్టి తౌడు, వెస్ట్ మండ లం అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, వెంకటాద్రి తదితరు లు పాల్గొన్నారు.