మాదకద్రవ్యాలు, సామాజిక భద్రతపై అవగాహన
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్బీ కాలనీ తదితర ప్రాంతాల్లో మాదకద్రవ్యాలు, సామాజికభద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ మురళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, జీవితాలను పాడు చేసుకోవద్దని, తల్లిదండ్రులు పిల్లలు బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించమని చెప్పాలని తెలిపారు. హెచ్బీ కాలనీలో తుప్పలు పెరిగిపోయాయని రాత్రి సమయంలో వీధిలైట్లు వెలిగించాలని సంబంధిత అధికారులను కోరారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ వర్మ, భారీగా ప్రజలు పాల్గొన్నారు.