సూపరింటెండెంట్, ఎస్ఈలకు ఘనంగా సన్మానం
అక్షర కిరణం, (విశాఖపట్నం): ప్రజారోగ్యం పురపాలక సాంకేతిక విభా గంలో సుధీర్ఘ సేవలందించిన సూప రింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈలు) పట్నాల గణపతిరావు, సూపరింటెం డెంట్ దన్నిన సత్యనారాయణలను సిబ్బంది ఘనంగా సత్కరించారు. గణ పతిరావు 37ఏళ్ల పాటు ఏఈ, డీఈఈ, ఈఈగా పని చేసి ఎస్ఈ స్థాయికి ఎదిగారని కొనియాడారు. సత్యనారాయణ కూడా 31ఏళ్లలో టైపిస్ట్, సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసి సూపరింటెండెంట్ స్థాయికి వచ్చా రన్నారు. అంతేకాకుండా 20ఏళ్ల పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల వద్ద ఆయన పీఏగా కూడా పని చేశారని గుర్తుచేశారు. కార్యక్రమానికి అతిథిగా చీఫ్ ఇంజినీర్ వినయ్‌కుమార్ హాజరై సన్మాన గ్రహీతలకు పుష్పగుచ్ఛం అంద జేసి శుభాకాంక్షలు తెలిపారు. ఐదు జిల్లాల మున్సిపల్ ఇంజినీర్లతోపాటు కార్యాలయ సిబ్బంది శాలువాలు, గజ మాలతో సత్కరించారు. వారి శేష జీవితం ఆయురారోగ్యాలు, సుఖ సం తోషాలతో ఉండాలని ఆకాలు రవి, వేణుగోపాల్, ఈఈలు రాయల్ బాబు, కామేశ్వరరావు, సుగుణాకరరావు, దక్షిణా మూర్తి, డీఈలు రామ కృష్ణా రావు, గోపాలకృష్ణ, జగన్ మోహన్, పద్మావతి, డీపీహెచ్ఈవో మహేష్, నర్సింగ్‌రావు, రిటైర్డ్ ఉద్యోగులు దుర్గా ప్రసాద్, శ్రీనివాసరావు, శ్రీహరిరావు, మెహెర్‌బాబా తదితరులు పాల్గొన్నారు.