గోపాలపట్నం రైల్వే స్టేషన్ వద్ద ఆటో, టాక్సీ స్టాండ్ ప్రారంభం
అక్షర కిరణం, (గోపాలపట్నం): గోపాలపట్నం రైల్వే స్టేషన్ వద్ద ఆటో, టాక్సీ స్టాండ్‌ను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, డివిజనల్ రైల్వే మేనేజర్ లోహిత్ బోర్హ కలసి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ రైల్వే ప్రయాణీకుల భద్రత, సౌకర్యవంతమైన, నిర్ణీత ధరలతో గమ్యానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ ఆటో స్టాండ్‌ను ప్రారంభించామన్నారు. ఆటో స్టాండ్‌లోని ఆటోలకు అమర్చిన జీపీఎస్ అనుసంధానంతో ప్రయాణీకుల భద్రతను పర్యవేక్షించేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అంతేకాక ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో ప్రయాణీకులకు పూర్తి భద్రత అందించనున్నట్లు తెలియపరిచారు. ‘ఆటో టాక్సీ స్టాండ్ ఏర్పాటుకు సహకరించిన దాతలు, కంటైనర్ ఏర్పాటుకు సహకరించిన ఆలివ్ సతీష్‌ను ఫర్నిచర్‌కు సహకరించిన సోనోవిజన్, విశాఖపట్నం మేనేజర్ గోపాల్‌ను సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ, ఐఆర్టీఎస్ లోహిత్ బోర్హ సత్కరించారు. కార్యక్రమంలో డీసీపీ లా అండ్ ఆర్డర్ జోన్ డి.మేరి ప్రశాంతి, కె.ప్రవీణ్‌కుమార్, ఏడీసీపీ (ట్రాఫిక్) విశాఖపట్నం, పృధీ¸్వతేజ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, వెస్ట్ సబ్ డివిజన్, విశాఖపట్నం గోపాలపట్నం స్టేషన్‌హౌస్ ఆఫీసర్, ప్రభాకర రావు, సిబ్బంది, ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది రైల్వే పోలీస్ అధికారులు పాల్గొన్నారు.