వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కజీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున జీవీఎంసీ అధికా రులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ టెలి కాన్ఫరెన్స్‌లో అధికారులను గురువారం ఆదేశించారు. లోతట్టు, కొండ వాలు ప్రాంత ప్రజలు వర్షాలు పడుతున్న దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితిలో అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. జోనల్ స్థాయిలో లోతట్టు, కొండవాలు ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో వర్షాలు వలన కలిగే ప్రమాదా లను నివారించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టా లని అధికారులకు టెలి కాన్ఫరెన్స్‌లో కమిషనర్ ఆదేశించా రు. నగర పరిధిలో అన్ని మేన్ హోల్స్‌ను సురక్షిత మూతల తో కప్పి ఉండే విధంగా చూడాలని, ప్రజల తాగునీటికి ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని, నీరు కలుషితం జరగకుండా నాణ్యత పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించి ప్రజలకు తాగునీరు అందించాలని కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు.