భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కరాష్ట్ర మంత్రి సంధ్యారాణి
అక్షర కిరణం, (సాలూరు): రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో అరకు పార్లమెంట్ పరిధిలోగల రెండు జిల్లాలు పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలలో భారీవర్షాలు కురిసే కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, స్త్రీశిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి సూచిం చారు. స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న విద్యార్థుల సంక్షేమంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గిరిశిఖర ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడటంవల్ల రోడ్లపై రాకపోకలు బంద్ కావడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటా యన్నారు. ఈనేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈవిషయాలన్ని కలెక్టర్ తో చర్చించామని మంత్రి సంధ్యారాణి తెలిపారు.