వైభవ వేంకటేశ్వరుని సన్నిధిలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి
అక్షర కిరణం, (మాధవధార): మహా విశాఖ నగరం ఎన్జీజీవోఎస్ కాలనీలోని వైభవ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 10వ తేదీన శుక్రవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) ఉత్సవం వైభంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో బండారు ప్రసాద్ తెలిపారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఈవో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెల్లవారురaామున 2.45 గంటల నుంచి 3 గంటల వరకు స్వామివారికి మంగళ ధ్వని, 3 గంటల నుంచి 3.30 గంటల వరకు శ్రీవారికి సుప్రభాత సేవ నిర్వహిస్తామన్నారు. తెల్లవారురaామున 3.30 నుంచి 4 గంటల వరకు దర్పణం దర్శనం, గో దర్శనం, కన్య దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు శ్రీవారి అర్చన, మంగళశాసనం, తిరుప్పావై పఠనం ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఉదయాస్తామాన సేవ, సంపూర్ణ సేవ, ఇతర ఆర్జిత సేవ కాలం ఉంటుందని ఈవో తెలిపారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవారికి పల్లకీలో తిరువీధి ఉత్సవం నిర్వహిస్తామన్నారు. అనంతరం ఉదయం 6.15 గంటల నుంచి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవు తుందని ఈవో బండారు ప్రసాద్ తెలిపారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు దర్శనం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు, అదేవిధంగా రాత్రి 8 నుంచి 9 గంటల వరకు కల్పిస్తున్నామని వివరించారు. కాగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి గుడి సమీపంలో సింహాచలం దేవస్థానం స్థలంలో భక్తులు తమ వాహనాలను పార్క్ చేసుకోవాలని దేవస్థానం ఈవో బండారు ప్రసాద్ సూచించారు.