జీవీఎంసీ స్థాయి సంఘంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం
కమేయర్ గొలగాని
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థాయి సంఘం ఆమోదం తెలిపిందని స్థాయి సంఘం చైర్పర్సన్, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. శుక్రవారం ఆమె జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని స్థాయి సంఘం సమా వేశ మందిరంలో స్థాయి సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా స్థాయి సంఘం చైర్పర్సన్ మేయర్ గొలగాని మాట్లాడుతూ స్థాయి సంఘం సమా వేశంలో 71 అంశాలను పొందుపరిచారని తెలిపారు. వాటి ని స్థాయి సంఘం సభ్యులు చర్చించి 11 అంశాలు వాయి దా వేసినట్టు చెప్పారు. మిగిలిన 60 అంశాలు ఆమోదం పొందాయన్నారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి న రూ.17.50 కోట్లు అభివృద్ధి పనులకు, మిగిలిన అంశాలు రెవెన్యూ, ఉద్యోగుల సర్వీసులకు సంబంధించి అంశాలు ఉన్నాయని వాటిని చర్చించి సభ్యులు ఆమోదం తెలిపారని చైర్పర్సన్ తెలిపారు. సమావేశంలో జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి.వాసుదేవ రెడ్డి, 6వ జోన్ జోనల్ కమిషనర్ బీఆర్ఎస్.శేషాద్రి, కార్యనిర్వా హక ఇంజినీర్లు శ్రీధర్, శేఖర్, కనకరావు, ఉప కార్యనిర్వా హక ఇంజినీరు ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.