జేఎన్టీయూ జీవీలో సర్టిఫికేషన్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
అక్షర కిరణం, (విజయనగరం ప్రతినిధి): జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురజాడ విజయనగరం (జేఎన్టీయూజీవీ)లో ‘సర్టిఫికేషన్ కోర్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ లిపై ఆన్లైన్లో సర్టిఫికేషన్ కోర్స్‌కు సంబంధించి పోస్టర్ ఈనెల 14న ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి ఆన్లైన్లో విడుదల చేశారని జెఎన్‌టియుజివి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ తెలియజేసారు.
(1) ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటుం కంప్యూటింగ్ అంశాలపై ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సు ఉంటుందని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ తెలిపారు. ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులో పేర్లు నమోదు చేసుకోవడానికి ఆగస్టు 5 చివరి తేదీ అని తెలిపారు. ఈ సర్టిఫికేషన్ కోర్సులో ఎటువంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేసుకోవటానికి సాయంత్రం 5 నుండి 5-30 గంటల మధ్య సమయంలో ‘7780351078’’ అనే మొబైల్ నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపారు. కోర్సు ఫీజు జనరల్ కేటగిరీ వారికి రూ.25,000, మహిళలకు ూజ/ూు కేటగిరి వారికి రూ.20,000 అని చెప్పారు.