బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం
కతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
క3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
అక్షర కిరణం, (అమరావతి/విశాఖపట్నం): బంగాళా ఖాతంలో ఈనెల 18, 23 తేదీల్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. సోమవారం తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 18, 19 తేదీల్లో అత్యంత అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడిరచింది..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిరది. దీని ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధాన పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. విశాఖ, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఐదు రోజులు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేశారు.