చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కి అల్లు అర్జున్
సంధ్య థియేటర్ కేసు విచారణకు హాజరు వెంటే వెళ్లిన తండ్రి అరవింద్, మామ
అక్షర కిరణం, (హైదరాబాద్): సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ పోలీసుల విచారణ కి హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకి పోలీస్‌స్టేషన్‌కి రావాలని పోలీసులిచ్చిన నోటీసులో పేర్కొన్నా రు. దీంతో బన్నీ తన ఇంటి నుంచి 10 గంటల 40 నిమిషా లకే పోలీస్ స్టేషన్‌కి బయలు దేరారు. బన్నీతోపాటు తండ్రి అల్లు అరవింద్, తన మామ చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఉన్నారు. అలానే బన్నీ లీగల్ టీమ్ కూడా పోలీస్ స్టేషన్‌కి వచ్చింది.
ఆ వీడియోపైనే
నోటీసులు వచ్చిన తర్వాత తన లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్ సంప్రదింపులు జరిపారు. విచారణకు హాజరయ్యే విషయం, ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందన్న దానిపై చర్చించి నట్లు తెలుస్తోంది. అయితే తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల ఓ 10 నిమిషాల వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగానే అల్లు అర్జున్ను ప్రశ్నిం చే అవకాశముంది. బన్నీ నిర్వహించిన ప్రెస్మీట్పైనా ప్రశ్నలు వేసే ఛాన్స్ ఉంది. ఇక బన్నీ వస్తుండడంతో చిక్కడ పల్లి పీఎస్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
ఈ కేసులో అల్లు అర్జున్‌ని ఏసీపీ రమేష్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీలు విచారించనున్నారు. బన్నీ స్టేట్మెంట్ని రికార్డ్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయనున్నారు. ఇప్పటికీ సంధ్య థియేటర్ ఘటనకి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి. అల్లు అర్జున్, తన పిల్లలు, మామ ఇలా అందరూ వేరువేరు కార్లలో సంధ్య థియేటర్ లోపలికి వచ్చిన విజువల్స్.. బన్నీ అభివాదం చేస్తూ థియేటర్లోకి వెళ్లిన వీడియోలు ఉన్నాయి.
అలానే తన బౌన్సర్లతో సంధ్య థియేటర్ బాల్కనీలోకి బన్నీ వెళ్తున్న వీడియో.. ఆ సమయంలో బౌన్సర్లు.. ఆ గేటును క్లోజ్ చేస్తున్న వీడియో కూడా ఉంది. ఇక ఈ కారణంగా థియేటర్లో లోపలికి ప్రేక్షకులు ఒకే ద్వారం నుంచి వెళ్లాల్సి వచ్చిందని అప్పుడే తొక్కిసలాట జరిగిందంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. ఇక బన్నీని చూసేందుకు బాల్కనీపైకి కొంతమంది ఫ్యాన్స్ ఎక్కుతున్న వీడియో కూడా ఉంది. ఇలా పలు వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. వీటన్నింటినీ చూపిస్తూ బన్నీని పోలీసులు కొశ్చన్ చేసే అవకాశం ఉంది.
రాజకీయ లొల్లి..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు రాజకీయ లొల్లిగా మారింది. ఈ సంఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో సైతం ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చినతరువాత సినీ ప్రముఖు లందరూ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేశారు. అల్లు అర్జున్ కారణంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుంటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లని సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి మాత్రం వెళ్లడంపై వారి ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. కాగా ఇటు ఏపీలో సైతం ఈ ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు, వైసీపీ నాయకులు ఆయన అరెస్టుపై మెగాస్టార్ కుటుంబంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.