పల్లె పండుగ పనులన్నీ డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలి
కకలెక్టర్ బీఆర్ అంబేద్కర్
అక్షర కిరణం, (విజయనగరం): పల్లె పండుగ కార్యక్రమం కింద మంజూరైన పనులన్నింటినీ డిసెంబర్ 15లోపల పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ఆదేశించారు. ఈకార్యక్రమం కింద చేపడుతున్న సీసీ రోడ్లు, కాటిల్ షెడ్స్ తదితర పనులపై వీడియో కాన్ఫరెన్స్ తో మండలాల వారీగా బుధవారం సమీక్షించారు. పంచా యతీరాజ్లో 2203 పనులు మంజూరు కాగా 1407 పనులు గ్రౌండ్ అయ్యాయని, 61 పనులు పూర్తయ్యా యని, 6 పనులకు మాత్రమే బిల్లులను సమర్పించారని తెలిపారు. పనులు వేగంగా జరగాలని, పూర్తి చేసిన బిల్లులను వెంటనే సబ్మిట్ చేయాలని ఆదేశించారు. తక్కువ ప్రోగ్రెస్ ఉన్న మండ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్ల తప్ప మిగిలిన మండలాలన్నీ వెనకబడి ఉన్నా యని, ఇదేపరిస్థితి కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చ రించారు. ఇంతవరకూ మొదలు పెట్టని పనులకు ప్రస్తుత వెండర్‌ను రద్దు చేసి కొత్త వెండర్‌తో పనులు మొదలు పెట్టాలన్నారు. కాటిల్ షేడ్స్ జిల్లాలో 858 మంజూరు కాగా 386 గ్రౌండిరగ్స్ అయ్యాయని, వీటిని త్వరగా పూర్తి చేసి బిల్లులను సమర్పించాలని ఆదేశించారు. మిగిలిన వాటిని సత్వరమే ప్రారంభించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో సత్యనారాయణ, డ్వామా పీడీ కల్యాణ చక్రవర్తి, పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.