‘ఆపరేషన్ కగార్’తో ఆదివాసీలను అంతమొందించే పాలకుల కుట్రలను ప్రతిఘటిద్దాం
కసీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పిలుపు
అక్షరకిరణం, (బొడ్డపాడు): మధ్యభారత దేశంలో కార్పొరేటీకరణను, సైనికీకరణను శక్తివంతంగా ఎదుర్కొం టున్న ఆదివాసులను చంపేయాలనే దుర్మార్గపు కుట్రలో భాగంగానే ‘ఆపరేషన్ కగార్ ‘అనే అంతిమ యుద్ధాన్ని మతోన్మాద ఆరెస్సెస్ బీజేపీ పాలకులు నేడు నడుపుతు న్నారని సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు తాండ్ర ప్రకాష్ అన్నారు. ఫాసిజాన్ని, కార్పొరేట్ హిందూ దేశాన్ని స్థాపించాలనే కుట్రలో భాగంగానే విప్లవ చైతన్యాన్ని తుడిచేయాలనే తలంపుతో పాలకులున్నారని పీడిత అస్తిత్వ ప్రజలను విముక్తి దిశగా నడిపించే, కార్పొరేటీకరణను సమరశీలంగా ఎదుర్కొనే విప్లవో ద్యమాన్ని నిర్మించడంతోనే పాలకుల దుర్మార్గాలను నిలు వరించగలమన్నారు. ఆపరేషన్ కగార్’ పేరుతో ఆదివాసీ లను అంతమొందించే పాలకుల కుట్రలను ప్రతి ఘటించా లని పిలుపునిచ్చారు. బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం ఆవరణలో నిర్వహించిన పోస్టర్ను ప్రకాష్ ఆవిష్క రించారు. కార్యక్రమానికి స్మారక కమిటీ అధ్యక్షుడు గొరకల బాలకృష్ణ అధ్యక్షత వహించారు. పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, విప్లవ పోరాట యోధులు కుమారన్న, జయక్కల స్మారక కమిటీ కార్యదర్శి పోతనపల్లి మల్లేశ్వరరావు, కమిటీ సభ్యులు, పలు ప్రజా సంఘాల నాయకులు మాధవరావు, గోపి జె.అప్పయ్య, పున్నయ్య, కామేష్, జానకమ్మ సరస్వతమ్మ లచ్చుమయ్య, ముఖలింగం, వాసు, లోకనాధం తదితరులు పాల్గొన్నారు.