మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం
కముగ్గురికి గాయాలు కమంత్రి మెంటాడ మండలం పర్యటనకు వెళుతుండగా ఘటన
అక్షరకిరణం, (విజయనగరం/విశాఖపట్నం): రాష్ట్రమంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. విజయనగరం జిల్లాలో మంత్రి సంధ్యారాణి మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రామభద్రపురం మండలం భూసాయి వలసలో మంత్రి ఎస్కార్ట్ వాహనాన్ని ఓ వ్యాను ఢీకొట్టింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కాన్వాయ్‌ను ఆపేశారు. కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు భద్రతా సిబ్బందితోపాటు, వ్యానులోని ముగ్గురికి స్వల్పగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని మంత్రి సంధ్యారాణి అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.