ఏపీ కళింగ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం
అక్షరకిరణం, (పలాస): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్గా భావన దుర్యోధన విజయవాడలోని రాష్ట్ర బీసీ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేషన్ చైౖర్మన్ రోనంకి కృష్ణం నాయుడు, ఇతర డైరెక్టర్లతో కలసిర్య క్రమంలో ముఖ్య అతిథులుగా ఆముదాలవలస, పలాస, నరసన్నపేట ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, ఏపీటీపీ ఆయన ప్రమాణస్వీకారం చేశారు. తనకు ఈ గౌరవం దక్కడంలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ రుణపడి ఉంటానని తెలిపారు. కాసీ చైర్మన్ వజ్జ బాబూరావు, టీడీపీ మందస మండలం నాయకులు రట్టి లింగరాజు, లబ్బ రుద్రయ్య, ముడుమంచి నవీన్ కుమార్, ముంజేటి చంద్రశేఖర్, తమ్మినేని ధనుంజయ, దేబాసిస్ పండా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.