పకాష్రావు పాలెం క్రీస్తు లూథరన్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
అక్షర కిరణం, (నల్లజర్ల): తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండ లం ప్రకాష్ రావు పాలెంలోని క్రీస్తు లూథరన్ చర్చ్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమా నికి సభాధ్యక్షులుగా రెవరెండ మరపట్ల ప్రసాద్ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ, కండవల్లి రాబిన్ పాల్ హాజర య్యారు. సభకు అధ్యక్షత వహించిన మరపట్ల ప్రసాద్ మాట్లాడుతూ క్రైస్తవు లందరూ ఐకమత్యంతో కలిసి ఉండా లని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పిన మాట లను పాటించాలన్నారు. వైసీపీ ఏపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవ రపు జాన్ వెస్లీ మాట్లాడుతూ క్రైస్తవు లందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియ జేశారు. ప్రపంచంలో అత్యధికంగా అన్ని భాషల వారు చేసుకునే పండుగ క్రిస్మస్ ఒకటేనని అన్నారు. యేసుక్రీస్తు పుట్టుక ఈ ప్రపంచానికి ఒక సందేశా న్ని ఇచ్చిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా క్రైస్తవ సంఘ కాపరులకు గౌరవ వేత నాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. క్రైస్తవులకు ఎన్నో రకాలుగా గత ప్రభుత్వంలో సహాయ సహకారాలు అందించారన్నారు. క్రైస్తవుల సంక్షేమా నికి రూ.416 కోట్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఖర్చు చేశారని తెలిపారు. మరొ అతిథి ఖండవల్లి రాబిన్ పాల్ మాట్లాడుతూ మతం అనేది దేవుని ఆరాధించే ఒక ప్రత్యేకమైన విధానమ ని, ఏ మతమైనా దేవుడిని వెతుకు కుంటూ వెళుతుందన్నారు. క్రైస్తవ మతంలో మాత్రం దేవుడే మనుష్యు లను వెతుకుకొని ఈ భూలోకానికి వచ్చి మన అందరి పాపాల కోసం ఆయన మరణించాడన్నారు. క్రైస్తవు డంటేనే ఒక ప్రత్యేకమైన గుణగణాలు కలిగిన వ్యక్తిగా అందరిలోనూ ఆకర్షణీ యంగా ఉండగలగాలని, ప్రేమ, దయ, జాలి, సమర్పణ ప్రతి క్రైస్తవుడులోనూ ఉండాలని సూచించారు. అప్పుడే నిజమైన క్రైస్తవులుగా గుర్తించబడతా మని చెప్పారు. అనంతర0 సంఘ కాపరులకు బ్రదర్ కండవల్లి రాబిన్ పాల్ ఆర్థిక సహాయంతో సంఘ కాప రులందరికి దుస్తులు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో క్రైస్తవ సంఘ కాపరులు, మత పెద్దలు పాల్గొన్నారు.