ఏసీబీ వలలో చిక్కిన అవినీతి చేప
కరూ.60 వేలు లంచంతో జిల్లా మత్స్యశాఖ అధికారి వేముల తిరుపతయ్యను
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
అక్షర కిరణం, (పార్వతీపురం మన్యం జిల్లా): అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో మరో అవినీతి చేప చిక్కింది. రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఈ అక్రమార్కుడిని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఒక వ్యక్తి వద్ద నుంచి జిల్లా మత్స్యశాఖ అధికారి వేముల తిరుపతయ్య రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. తిరుపతయ్యపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.