ఎస్ఎస్ఎస్ వెన్నెల ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అ..ఆ.. కార్యక్రమం
అక్షర కిరణం, (మాధవధార): అక్షర కిరణం, (విశాఖపట్నం): అ అంటే అనాథలు కాదు... ఆ అంటే ఆత్మీయులు... అనే నినాదంతో ఈనెల 16వ తేదీన విశాఖపట్నం వీఎంఆర్డ్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఎస్ఎస్ఎస్ వెన్నెల ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమ వివరాలను ట్రస్ట్ సభ్యులు విలేఖరుల సమావేశంలో వెల్లడిరచారు. గురువారం విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన సమావేశంలో ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని ట్రస్ట్ చైర్మన్ సదాశివుని రవితేజ వివరించారు. అనాథóల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ వెన్నెల ట్రస్ట్‌ని నెలకొల్పినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆడపిల్లల సంరక్షణ ధ్యేయంగా వారిని సమాజంలో ఒక గొప్పగా నిలపాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ని స్థాపించామన్నారు. బాలికలకు విద్య, వైద్యం, సంరక్షణ అందిస్తూ ముఖ్యంగా క్రీడలలో ఒక అత్యున్నత స్థాయికి చేర్చాలని ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ని ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు. ఈ సంస్థతో 5 నుండి 18 ఏళ్ల మధ్య ఆడపిల్లలకు ఒక నీడగా తోడుగా ఉండాలనే ఆకాంక్షించారు. డ్రీమ్ షెల్టర్స్ సౌజన్యంతో జరు గుతున్న ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కళాకారులు ప్లే బ్యాక్ సింగర్ సమీరా భరద్వాజ్, జానపద కళాకారులు, రాజకీ య, సినీ రంగానికి చెందిన ముఖ్య వ్యక్తులు పాల్గొంటారని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి పిల్లలకు ఆసరాగా నిలవాలని ట్రస్ట్ చైర్మన్ రవితేజ కోరారు. ఈ కార్య క్రమంలో ట్రస్ట్ సభ్యులు, డ్రీమ్స్ షెల్టర్ నిర్వాహకులు పాల్గొన్నారు.