హిందూ ధర్మ పరిరక్షణ కోసం మహేంద్ర సైకిల్‌పై సాహస యాత్ర
అక్షర కిరణం, (శ్రీకాకుళం): హైందవ ధర్మాన్ని విశ్వ వ్యాప్తం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం ఆలయ కార్యనిర్వహణాధికారి జి.గురునాదరావు అన్నారు. మంగళ వారం శ్రీకాకుళంలో ఆదిత్యా జుంబా నడక సంఘం ఆధ్వ ర్యంలో విశాఖపట్నం నుండి కలకత్తా సైకిల్‌పై వెళ్తున్న మహేంద్ర అనే యాత్రికునికి శ్రీకాకుళంలో స్వాగతం పలి కారు.. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ట్రస్ట్ అధ్వర్యంలో మహేంద్రకు సంఫీుభావం తెలిపారు. ఆరోగ్య భారత్ సాధన కు సైకిల్ యాత్ర ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.. దసరా పండగ సందర్భంగా కలకత్తా కాళీమాతను దర్శించుకు నేందుకు విశాఖ జిల్లా అచ్చుతాపురం నుండి కలకత్తా వెళ్తున్నానని సాహస యాత్రికుడు మహేంద్ర మీడియాకు వెల్ల డిరచారు.. వారం రోజులపాటు ఈ యాత్ర సాగుతుంద న్నారు. దారి పొడుగునా హైందవ ధర్మ ప్రచార కార్యక్రమా లు చేసుకుంటూ.. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ యాత్ర సాగిస్తున్నారు.. ఆదిత్యా జంబా డాన్స్ బృందం సాహస యాత్రికునికి. అపూర్వ స్వాగతం పలికారు.. గతంలో అనేక సాహస యాత్రలు చేశానని.. ఇది హైందవ ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న సైకిల్ యాత్ర అని ఆయన చెప్పారు. కార్యక్ర మంలో ఆదిత్యా జుంబా డాన్స్ ప్రతినిధులు బి.దేవీప్రసాద్.. కింతలిసాయికుమార్, బి.గారయ్య, బి.రామ కృష్ణ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ట్రస్ట్ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ శాసపు జోగినాయుడు తదితరు లు పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీకూర్మం ఆలయ కార్యనిర్వహణాధికారి జి.గురునాథరావు, జెంబా డాన్స్ అండ్ నడక సంఘం కోచ్ బత్తుల దేవీప్రసాద్, మహేంద్ర... సైకిల్ యాత్రికుడు, అధ్యక్షుడు కింతలి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.