జీవీఎంసీ గ్రీవెన్స్ సెల్‌కు 90 వినతులు
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవీఎంసీలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 90 వినతులు వచ్చాయని కమిషనర్ తెలిపారు. ఎక్కువ శాతం టౌన్ ప్లానింగ్‌కు సంబంధించినవి వచ్చాయన్నారు. త్వరలో వాటికి పరిష్కారం చూపిస్తామని తెలిపారు. కాలువలు, డ్రైనేజీలు రోడ్ల మరమ్మత్తులు చెపడతామని తెలిపారు. టౌన్ ప్లానింగ్ విషయంలో త్వరలో సింగల్ విండో విధానం ప్రవేశ పెట్టబోతున్నామని కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ స్వామి నారాయణ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.