టీవీకే మహానాడులో విషాదం
కతొక్కిసలాటలో 400 మంది అస్వస్థత
అక్షర కిరణం, (చెన్నై/జాతీయం): మధురైలో గురు వారం (ఆగస్టు 21న) నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) రెండో మహానాడుకు భారీ ఎత్తున విజయ్ అభిమా నులు పోటెత్తారు. దీంతో బహిరంగ సభలో రద్దీ ఏర్పడి.. తోపు లాట జరిగింది. ఈక్రమంలో 400 మంది అభిమానులు, కార్యకర్తలు స్పృహతప్పి పడిపోయారు. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైనవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అంతకు ముందు విజయ్ జెండా ఎగుర వేసేలా 100 అడుగుల పోల్‌ను ఏర్పాటు చేస్తుండగా విరిగి కారుపై పడిరది. దీంతో వాహనం ధ్వంసమై.. అందులో ఉన్న ఒకరు మృతిచెందారు.
ఈ బహిరంగ సభకు భద్రత కోసం మొత్తం 3 వేల మంది పోలీసులు, 2 వేల మంది ప్రైవేటు సెక్యూరిటీ, 500 మంది మహిళా బౌన్సర్లును వినియో గించారు. మదురై వద్ద అరుప్పుకోట్టై-తూత్తుకుడి సాలైలో 500 ఎకరాల విస్తీర్ణంలో వేదిక ఏర్పాటు చేశారు. 2 లక్షల మంది కూర్చునేలా గ్యాలరీలు, వాహన పార్కింగ్, తాగునీరు, వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. అలాగే, వేదికపై నుంచి కార్యకర్తల మధ్యకు విజయ్ నడిచివచ్చేలా 300 మీటర్ల పొడవునా ర్యాంపు ఏర్పాట్లు చేశారు. ఈ సభ నుంచి ఎన్నికల శంఖరావం పూరించిన విజయ్.. తాను మదురై తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విజయ్ విమర్శలు గుప్పించారు. నీట్‌ను ప్రధాని మోదీ రద్దు చేయగలరా? అని ప్రశ్నించారు. ‘800 మంది తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడి చేసింది. మా మత్స్యకారుల భద్రతను నిర్ధారించడానికి, కట్చతీవు (దీవులు) తిరిగి మాకు ఇవ్వండి’ అని డిమాండ్ చేశారు. ‘దొంగచాటు ఒప్పందాలు చేసుకోడానికి, పొత్తులు పెట్టుకుని ప్రజలను మోసం చేయడానికి టీవీకే ఓ పార్టీ కాదు... మేము ఎవరికీ భయపడం.. తమిళనాడు ప్రజలు, మహిళలు, యువత మా వెంట ఉన్నారు’ అని విజయ్ స్పష్టం చేశారు.
‘‘సింహానికి గుంపులో ఎలా ఉండాలో.. ఒంటరిగా ఎలా ఉండాలో తెలుసు.. వేటాడేందుకు మాత్రమే వస్తుంది.. వినోదం కోసం కాదు.. ప్రాణాలతో ఉన్నవారిని మాత్రమే వేటాడుతుంది..’’ అని పరోక్షంగా తాము ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని తేల్చిచెప్పారు. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల జరగనుండగా.. అధికారమే లక్ష్యంగా విజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గతేడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు విజయ్ పార్టీని ప్రకటించినా.. పోటీకి మాత్రం దూరంగా ఉన్నారు. తన టార్గెట్ 2026 అసెంబ్లీ ఎన్నికలేనని ఆయన స్పస్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ విజయ్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.