ఆలయంలో బాణసంచా పేలి 150 మందికి గాయాలు
8మంది పరిస్థితి విషమం
అక్షర కిరణం, (కేరళ/జాతీయం): బాణసంచా పేలుడు ప్రమాదంతో కేరళ కసర్గోడ్ ఉలిక్కిపడిరది! నీలేశ్వరంలోని ఓ ఆలయంలో బాణాసంచా పేలి, భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో 150మంది గాయపడ్డారు. వీరిలో 8మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కసర్గోడ్ నీలేశ్వరంలోని అంజుట్టంబలం వీరార్ కావు ఆలయంలో సోమవారం అర్థరాత్రి సమయం లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. థేయంకట్ట మహోత్స వాన్ని చూసేందుకు ఆలయానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడం మొదలుపెట్టారు. అయితే, బాణసంచా వెళ్లి పక్కనే ఉన్న ఓ గదిలో పడిరది. ఆ గదిలో అప్పటికే భారీ సంఖ్యలో బాణ సంచా ఉండటంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు చెలరేగాయి. ఫలితంగా అప్పటివరకు ఆహ్లాద కరంగా ఉన్న ఆలయ వాతావరణం ఒక్కసారిగా మారిపో యింది. ప్రజలు షాక్‌కు గురయ్యారు. పేలుడు అనంతరం ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయడంతో స్వల్ప తొక్కిసలాట కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 150మంది గాయపడినట్టు తెలుస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు. పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను నీలేశ్వరం, కనహంగద ్లోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయ పడిన వారిని కన్నూర్‌లోని పరియారం మెడికల్ కాలేజ్?కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వారిని మంగళూరులోని హాస్పిటల్‌కి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
జిల్లా కలెక్టర్ కే ఇంపశేఖర్, జిల్లా పోలీసు చీఫ్ డీ శిల్ప, ఇతర అధికారులు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందివ్వాలని ఆదేశాలు సైతం ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ప్రజలు, వ్యవస్థలకు సూచనలు ఇచ్చారు. అనుమతి లేకుండా ఆలయ ఆవరణ లోనే బాణసంచా కాల్చారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా, బాణసంచాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలుస్తోంది. కేరళ పోలీసులు ఆలయ అధ్యక్షుడు, కార్యదర్శిని అదుపులోకి తీసుకున్నారని న్యూస్ 18 మలయాళం నివేదించింది. ఈఘటనకు సంబంధిం చిన వీడియోలు ఆన్?లైన్లో వైరల్‌గా మారాయి. పేలుడు దృశ్యాలు అందరిని భయపెట్టే విధంగా ఉన్నాయి.