పాఠశాల విద్య ఐటీపై అసత్య ఆరోపణలకు ఖండన
అక్షర కిరణం, (విశాఖపట్నం): పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఐటీ విభాగంలో ఏడీ హోదాలో పనిచేస్తున్న వారిపై అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చార్వాక సమితి 2 ప్రతినిధులు తెలిపారు. ఉపాధ్యాయ బదిలీలు, ఉపాధ్యాయ నియామకాలు, విద్యార్థి ఉపాధ్యాయ ఆన్లైన్ హాజరు, పరీక్షల మూల్యాంకనం యూడీఐఎస్ఈ ఆన్లైన్ లోను డాష్ బోర్డు నిరంతర పర్య వేక్షణ ఐటీ సెంటర్‌తో జరుగుతుందన్నారు. ప్రస్తుతం సీబీ ఎస్ఈ వెయ్యి పాఠశాల లలో ఆన్లైన్ విద్యార్థుల పరీక్ష విజయవంతంగా చేస్తున్నారన్నారు. ఇది భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న ఆన్లైన్ ప్రక్రియ వినూత్నంగా విద్యార్థుల ట్యాబులతో వారి సామర్థ్యాలను అంచనా వేయడం దేశంలోనే ఇదే ప్రథమం అని పేర్కొన్నారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతిలో 82,000 మంది సీబీఎస్సీకి ఫీజులు చెల్లించారు. ఆన్లైన్ పరీక్ష నిర్వ హిస్తే 77000గా తేలిందన్నారు. కార్యాలయంలో అశాంతికి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధానాన్ని మానుకోవాలని చార్వాక సమితి- 2 ప్రతినిధులు కోరారు.