సేఫ్టీ ఆడిట్ చేయాలని ఎపుడో చెప్పాను
కఅచ్యుతాపురం ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అక్షర కిరణం, (హైదరాబాద్): అచ్యుతాపురం ఫ్యాక్టరీ ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ప్రమాదంలో యాజ మాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందని.. కాలుష్య నియంత్రణ తన శాఖ పరిధిలో ఉందని, భద్రత వేరే శాఖ కిందికి వస్తుందని తెలిపారు. గతంలోనే పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని చాలాసార్లు చెప్పామన్నారు. ఫ్యాక్టరీ లలో ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలని.. సెప్టెంబర్‌లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. ఇలా ప్రతివారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరమని, చనిపోయినవారికి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదన్నారు.
ఈ ఫార్మా కంపెనీకి ఇద్దరు యాజమానులు ఉన్నారని తెలుస్తోందని.. ఇద్దరి మద్య విబేధాలతో సరిగ్గా వ్యవహరిం చలేదని తెలుస్తోందన్నారు పవన్. ఫార్మా కంపెనీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదంటున్నారని.. సేఫ్టీ ఆడిట్ అంటే యాజమానులు భయపడే స్ధాయికి వెళ్లిపోయా రన్నారు. సేఫ్టీ ఆడిట్ ద్వారా పరిశ్రమలు మూసేస్తారని అను కుంటున్నారని.. పరిశ్రమల యాజమానులకి సేఫ్టీ ఆడిట్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వా నికి ఇబ్బంది ఉండకూడదనే తాను అడుగు ముందుకు వేయలేకపోతున్నానని.. సేఫ్టీ ఆడిట్‌తో పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతాయని అపోహలున్నాయన్నారు. బ్యూరోక్రసీ కూడా బలంగా పనిచేయాలని.. నిబంధనలని కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. పరిశ్రమలు రావాలి.. పర్యావరణ సమతుల్యత ఉండాలి.. వచ్చే మూడు నెలలలో కార్యచరణ ఉండాలన్నారు.