ఎస్సీ వర్గీకరణను పున:పరిశీలించాలంటూ ఆందోళన
అక్షర కిరణం, (విజయనగరం): విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ఎస్సీ వర్గీకరణకు నిరసనగా బంద్ పాటిం చారు. వివిధ జంక్షన్ల నుండి ఎయిమ్ ఆధ్వర్యంలో వర్గీక రణ వద్దు ఐక్యతే ముద్దు అనే నినాదాలతో అంబేద్కర్ వాదులు విద్యార్థులు యువకులు, మహిళలు, ఎయిమ్ కుటుంబం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలి పారు. గుర్ల జంక్షన్లో రెండుగంటలపాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఎయిమ్ జిల్లా కన్వీనర్ కెల్ల భీమా రావు ఆధ్వర్యంలో గుర్ల జంక్షన్లో మానవహారం చేపట్టారు. భీమారావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ మను వాదులు చేసిన కుట్ర అన్నారు. ఇద్దరు అన్నదమ్ములు మధ్య చిచ్చు పెట్టి పబ్బంగడుపుకోవడం మనువాదుల విధానం అని ధ్వజమెత్తారు. ఇటువంటి రాజకీయాలు చేసిన వ్యక్తు లు, సంస్థలపైన సుప్రీంకోర్టు కొరడా రaలిపించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు రిజర్వేషన్లు ప్రజల స్వేచ్ఛను హరించేవిధంగా మనువాదుల శాసనాలు ఉన్నాయ న్నారు. ఇటువంటి వాటిపై దేశ అత్యు న్నత న్యాయస్థానం పునఃపరిశీలన చేసి దళితులందరికీ న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల ఎయిమ్ కన్వీనర్ తలే నారాయణప్పడు, ఎయిమ్ సైనిక్ కన్వీనర్ బూసరి నూకరాజు, మహిళలు, యువతి, యువ కులు, ఎయిమ్ కుటుంబం సభ్యులు పాల్గొన్నారు.