స్కూల్ స్వీపర్లకు వేతన బకాయిలు చెల్లించాలంటూ వినతి
అక్షరకిరణం, (పలాస): ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న స్వీపర్లకు వేతన బకాయిలు చెల్లించాలని సీఐ టీయూ జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి స్వీపర్ల ప్రతినిధులు సుశీల, స్వాతి డిమాండ్ చేశారు. పలాస మండల విద్యా శాఖ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఎంఈవో శ్రీనివాసరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. పాఠ శాలల అభివృద్ధిలో స్కూళ్లలో శానిటేషన్ వర్కర్స్‌ని నియ మించారని, వారికి నాలుగు నెలలుగా జీతాలు అందక అవస్థలు పడుతున్నారన్నారు. అందులో పనిచేసే అందరూ దళిత, గిరిజన, అనగారిన వర్గానికి చెందినవారని, నెలం తా చాకిరీ చేస్తే నెలకు జీతం ఇవ్వక పోతే కుటుంబం ఎలా గడుస్తుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్ర మంలో ఆదమ్మ, నరసమ్మ, ఉమా, శకుంతల పాల్గొన్నారు.