సత్యం మృతిపై ఏఐకేఎంఎస్ సంతాపం
అక్షరకిరణం, (బొడ్డపాడు/పలాస): చరిత్ర పరిశోధక రచయిత కె. ముత్యం మృతి సాహిత్యం, సాంస్కృతిక రంగానికి తీరని లోటని, తన సాహిత్య సృజన, పరిశోధనలతో శ్రీకాకుళం ఆణిముత్యంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని పలు ప్రజా సంఘాల నాయకులు అన్నారు. పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనంలో బుధవారం ప్రజా సంఘాలు ఉమ్మడిగా నిర్వహించిన ముత్యం సంతాప సభకు అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేయంయస్ ) జిల్లా నాయకులు గొరకల బాలకృష్ణ అధ్యక్షత వహించి మాట్లాడారు. కార్యక్రమంలో తొలుత ముత్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజా సంఘాల నాయకులు, సాహితీ సాంస్కృతిక మిత్రులు నివాళులర్పించారు. ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి పోతనపల్లి కుసుమ, ప్రజా కళా మండలి నాయ కులు కొర్రాయి నీలకంఠం, ఉత్తరాంధ్ర మహిళా సంఘం నాయకురాలు పి.అరుణ, ప్రజారచయితలు వంకల రాజా రావు, వినోద్ కుత్తుం, కళాకారులు నిరంజన్ పాణిగ్రాహి, నారాయణ, రాపాక మాధవరావు, జడే అప్పయ్య, అరుణ తదితరులు పాల్గొని సంతాపం తెలిపారు.